HYD: సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్‌నగర్‌లో 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి బడ్డేరా శివకృష్ణ సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పనికి, తమ్ముడు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఇన్‌స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ
వారాసిగూడలో ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య


