హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటీ

KMR: లండన్, దావోస్ పర్యటనలను ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విదేశీ పెట్టుబడులు, మూసీ పునరుజ్జీవనం సాధించినందుకు సీఎంను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి అభినందించారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.