హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీశ్రీ రవిశంకర్‌తో 2 వేల మంది జెన్‌జీల సమావేశం

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో 2 వేల మందికిపైగా జెన్‌జీ యువతతో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తో సమావేశమయ్యారు. జీవితం, లక్ష్యాలు, విజయసాధన తదితర అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. భయం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని, కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రశాంతతను కోల్పోకుండా ఆశయాలను సాధించేందుకు ధ్యానం చేయాలని సూచించారు.