హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదు కుటుంబాల కుల బహిష్కరణ

KMR: రామారెడ్డి మండలం గోకుల్ తండాలో భూ వివాదం నేపథ్యంలో ఐదు కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు సోమవారం ఆరోపించారు. తమతో ఎవరైనా మాట్లాడితే రూ. 50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారని, తిరిగి కులంలో చేర్చుకునేందుకు ఒక్కో కుటుంబం రూ. లక్ష చొప్పున రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారన్నారు. పండుగల సందర్భంగా ఆలయానికి కూడా అనుమతించలేదని తెలిపారు.