హైదరాబాద్: 28°C
వార్తలు

ద్విచక్ర వాహనం చోరీ.. కేసు నమోదు

NZB: నగరంలో ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు 5వ టౌన్ ఎస్సై సునీల్ సోమవారం తెలిపారు. ఆనంద్ నగర్‌కు చెందిన అజయ్ తన స్కూటీని రాత్రి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం లేచే సరికి ద్విచక్ర వాహనం లేకపోవటంతో 5వ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.