కడప: జిల్లా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 302 కేసులు నమోదు చేసి రూ. 62,765 జరిమానా విధించినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వాహనదారులు నిబంధనలు పాటించాలి'


