హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్ యజమాని అరెస్ట్

KMR: పిట్లం (M) లోని రైస్ మిల్లు యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎంఆర్ ధాన్యాన్ని నూర్పిడి చేసి బియ్యం తిరిగి అప్పగించకపోవడంతో సుమారు రూ. 60 లక్షల ధాన్యం స్వాహా చేసినట్లు గుర్తించారు. సివిల్ సప్లై జిల్లా అధికారి శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు కాగా సోమవారం ఎస్సై ఆంజనేయులు, డీటీ సురేశ్ పంచనామా నిర్వహించి రజనీకాంత్ రెడ్డిని రిమాండ్‌కు పంపారు.