హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి: ఎస్పీ

ప్రకాశం: జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ సమస్యలపై సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్, లేదా సబ్-డివిజన్ ఆఫీసుల్లో ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 'మీకోసం' ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన 74 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిష్కించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.