హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దళితవాడల సమస్యలపై ధర్నా

PLD: దళితవాడల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం,కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. నెల రోజులుగా జిల్లాలోని 150 గ్రామాల దళితవాడల సమస్యలపై సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అనేక మౌలిక వసతుల సమస్యలు గుర్తించామన్నారు. 70 శాతం గ్రామాల్లో దళితులకు స్మశాన వాటికలు లేవని పేర్కొన్నారు.