హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీసీకి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు

VSP: ఏయూ పొలిటికల్ సైన్స్ విభాగ విద్యార్థులు ఇటీవల రాష్ట్ర శాసనసభ సమావేశాలను సందర్శించారు. అసెంబ్లీ సందర్శన అనంతరం విద్యార్థులు సోమవారం ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖరను కలిశారు. అసెంబ్లీ సందర్శనలో తమకు కలిగిన అనుభవాలను వీసీతో పంచుకున్నారు. శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు వీసీకి తెలిపారు.