హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరబల్లిలో డీఎంఎఫ్ నిధులపై ఆరోపణలు

అన్నమయ్య: వీరబల్లి (మం) వంగిమళ్ల గ్రామంలోని పెద్ద హరిజనవాడలో ఇప్పటికే పంచాయతీరాజ్ నిధులతో గ్రావెల్ రోడ్డు నిర్మించినప్పటికీ, ఐదు నెలలు గడవకముందే అదే రోడ్డుపై రూ.22 లక్షల డీఎంఎఫ్ నిధులతో మెటల్ రోడ్డు పనులు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్‌రాజు పనులను ప్రారంభించారు.