హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీలాదున్నబీ శాంతి ర్యాలీకి పిలుపు

KDP: జమ్మలమడుగు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి ఆధ్వర్యంలో ఈనెల 26న మీలాదున్నబీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రవక్త బోధనలు మహిళలు, పేదల అభ్యున్నతికి మార్గదర్శకమని తెలిపారు. బుధవారం సాయంత్రం పవిత్ర జ్ఞాపికల సందర్శన, ప్రత్యేక ప్రార్థనలు, అన్నదానం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.