హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

కడప కలెక్టరేట్‌ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంకరావం ధర్నా నిర్వహించారు. దళితవాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇళ్లులేని వారికి స్థలాలు, ఇళ్లు, స్మశానవాటికలకు స్థలాలు కేటాయించాలని కోరారు. ప్రతి కార్మికుడికి రూ.31 వేలు వేతనం, నిరుద్యోగ భృతి, అర్హులకు పెన్షన్లు ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.