హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సర్వే వేగవంతం చేయాలి: సీపీఐ

BHPL: టేకుమట్ల మండలంలో భూ సర్వేను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని సీపీఐ (ML) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో వసంతరామ్, తహసీల్దార్ స్వరూపరాణికి పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. సాదాబైనామా దరఖాస్తుదారులకు పట్టాలు ఇవ్వాలని, దళితుల భూముల సర్వే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీసీఐ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.