ములుగు (M) జాకారం ఊర చెరువుకు దేవాదుల పైపులైన్‌ను తక్షణమే అనుసంధానం చేసి సాగునీటి సమస్య పరిష్కరించాలని రైతులు, నాయకులు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీకి వినతిపత్రం సమర్పించారు. మాజీ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అధికారులను కలిసి సమస్యను వివరించారు. దేవాదుల ప్రధాన పైపులైన్ సమీపంలోనే ఉన్నా చెరువుకు నీరు మళ్లక పంటలు ఎండిపోతున్నాయన్నారు.
తెలంగాణ
"దేవాదులకు జాకారం ఊర చెరువుకు అనుసంధానించాలి'


