హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం'

MNCL: ప్రజా ప్రభుత్వంలో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం నుంచి దౌడేపల్లి గ్రామం వరకు రూ.2.89 కోట్లతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు.