హైదరాబాద్: 28°C
తెలంగాణ

దోమలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

VKB: ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. దోమ మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయ సూచించారు.