హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లిమర్లలో రోడ్డెక్కిన బీజేపీ

VZM: ప్రజా సమస్యలపై కూటమి భాగస్వామ్య పార్టీ బీజేపీ నెల్లిమర్ల పట్టణంలో రోడ్డెక్కింది. గత ప్రభుత్వ హయాంలో 1450 మంది నిరుపేదలకు మంజూరైన ఇళ్ల స్థలాలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్దిదారులతో కలిసి సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నగరపంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బైఠాయించి తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.