ASF: వరి పంట వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని దహెగాం మండల AO రామకృష్ణ సూచించారు. డీలర్ల వద్ద కొనుగోలు చేసిన విత్తనాల వివరాలను నమోదు చేయాలన్నారు. సొంత విత్తనం వాడిన రైతులు వైవా వెర్షన్ డిక్లరేషన్ రైతువేదికలో అందజేయాలని తెలిపారు. కొనుగోలు చేసిన విత్తనాలకు లాట్ నంబర్‌తో కూడిన బిల్లు సమర్పించాలన్నారు. నమోదు చేయకపోతే బోనస్ కోల్పోయే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
'పంట వివరాలు నమోదు చేయకపోతే బోనస్ రాదు'


