హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్లకు నోటీసులు.. కలెక్టర్ కీలక సూచన

NGKL: జిల్లాలో ఓటర్ల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR)లో భాగంగా 1,15,851 మంది ఓటర్లను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. అనర్హులు, నకిలీ ఓట్ల తొలగింపే లక్ష్యమన్నారు. నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందకుండా BLOలను సంప్రదించి పత్రాలు సమర్పించాలని కోరారు.