హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆధునిక వైద్య సాంకేతికతతో మెరుగైన సేవలు'

VSP: ఆధునిక వైద్య సాంకేతికతను వినియోగించుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సోమవారం పిఠాపురం కాలనీలో విర్జిల్ హెల్త్ కేర్ ప్లాట్‌ఫామ్ నూతన కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. వందలాది వైద్య పరీక్షలను తక్కువ సమయంలో నిర్వహించే ఆధునిక ల్యాబ్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు.