హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఆది

SRCL: చందుర్తి మండలం లింగంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను ఎస్పీ మహేష్ బి. గీతేతో కలిసి పరామర్శించి నివాళులర్పించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.