హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై బాలికలకు అవగాహన

అన్నమయ్య: రాజంపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మహిళా భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బాల్య వివాహాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో శక్తి టీమ్ సేవలను వినియోగించుకోవాలని, సమస్యలను భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.