హైదరాబాద్: 28°C
తెలంగాణ

బురద రోడ్డుతో కాలనీవాసులకు కష్టాలు

MBNR: ​జడ్చర్ల 3వ వార్డు మణికంఠ కాలనీలో రోడ్లు బురదమయంగా మారడంతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏబీసీ స్కూల్ రహదారి అధ్వానంగా ఉండటంతో బస్సులు, ఆటోలు రావడం లేదని కాలనీవాసులు తెలిపారు. కమిషనర్ పరిశీలించినా పనులు ప్రారంభం కాలేదని, వెంటనే రోడ్డు వేయాలని కోరారు.