SKLM: జడ్పీ నిధులను పంచాయతీ అధికారులు అడ్డుకుంటున్నారని పొలాకి జడ్పీటీసీ సభ్యులు ధర్మాన కృష్ణ చైతన్య ఆరోపించారు. కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. పొలాకి మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోదించిన పనులకు ఉత్తర్వులు జారీ అయినా, వర్క్ కమిటీ తీర్మానాలు చేయడానికి ప్రత్యేక అధికారులు నిరాకరిస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జడ్పీ నిధులను అధికారులు అడ్డుకుంటున్నారు'


