హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 27న వాహనాల వేలం పాట

ATP: డి. హీరేహాల్ మండల కేంద్రంలో ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 27న వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. నాలుగు బైకులు, ఒక కారును వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్ కార్డు, రూ.1000 డిపాజిట్ చెల్లించి ఈ బహిరంగ వేలంపాటలో పాల్గొనవచ్చు అన్నారు.