W.G: కాళ్ళ మండలం కాళ్లకూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ మాడ వీధుల విస్తరణకు విరాళం లభించింది. తాడినాడకు చెందిన దివంగత కంతేటి సత్యనారాయణరాజు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని సోమవారం అందజేసినట్లు ఆలయ ఛైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. దాతల ఉదారతను ఆలయ కమిటీ అభినందించింది.
ఆంధ్రప్రదేశ్
మాడవీధుల విస్తరణ కోసం విరాళం


