హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి'

KMR: మాచారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మఒడి కార్యక్రమం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ ఆదర్శ్ తెలిపారు. ప్రతి నెల సమయానుసారంగా గర్భిణీలు వైద్య పరీక్షలు నిర్వహించుకొని మందులు వాడాలని అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. పలువురు గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.