హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోటార్ చెడిపోయి మూడు నెలలు.!

ELR: ఉంగుటూరు ఉపాధి హామీకార్యాలయానికి సంబంధించిన మోటారు పాడైపోయి మూడు నెలలు దాటుతున్నా నేటికీ అలాగే ఉంది. వాటర్ సదుపాయం లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. టాయిలెట్ అవసరాల కోసం ఉపాధి సిబ్బంది మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. ఉపాధి హామీ అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త మోటారు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.