హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'గ్యాస్ పంపిణీలో నిర్లక్ష్యం'

ASR: చింతపల్లిలో వంట గ్యాస్ పంపిణీలో నిర్లక్ష్యంపై సోమవారం వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గ్యాస్ గోదాం ఎదుట నిరసనకు దిగారు. గ్యాస్ నిర్వహకులు సోమవారం గ్యాస్ పంపిణీ చేస్తామని చెప్పడంతో వచ్చామని తీరా వచ్చాక పంపిణీ చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.