సత్యసాయి: కళ్యాణదుర్గం మండలంలోని పాత చెరువు ప్రాథమిక పాఠశాలకు మిత్రబృందం చొరవతో కొత్త రూపు వచ్చింది. పాఠశాలలో 30 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుడు పెద్దన్న తన నవోదయ మిత్రులకు పాఠశాల పరిస్థితులను వివరించగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రూ.70 వేలు సాయం చేశారు. గ్రామస్థులు మరో రూ.20 వేలు సమకూర్చారు. మొక్కల పెంపకం, గోడలపై జాతీయ నాయకుల చిత్రాలు వేయించారు.
ఆంధ్రప్రదేశ్
మిత్రుల సాయంతో మారిన బడి


