హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపల్లిలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

KDP: రాయచోటి నియోజకవర్గం కొత్తపల్లిలో ఈ నెల 27న జరగనున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 10 వేల మంది భక్తులకు మహా అన్నదానం నిర్వహించనున్నారు. అన్నదాన స్థలాన్ని మంత్రి పరిశీలించి, భక్తులకు తాగునీరు, కూర్చునే వసతి, అన్నప్రసాద వితరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.