హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్టాండ్‌లో పెరిగిన ప్రయాణికుల రద్దీ

NTR: నందిగామ బస్టాండ్‌లో సోమవారం ప్రయాణికుల రద్దీ భారీగా నెలకొంది. వారాంతం ముగియడంతో ఉద్యోగులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకోవడంతో కిటకిటలాడింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.