హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోం మంత్రి అనిత చేతికి స్వల్ప గాయం

TPT: తిరుపతిలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్‌ కార్యక్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. హోం మంత్రి అనిత చేతిపై డ్రోన్‌ బ్యాటరీ పడటంతో ఆమెకు స్వల్ప గాయమైంది. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు డ్రోన్‌ను సీజ్‌ చేశారు. కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.