హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సినీ నటుడిగా మారిన ఎమ్మెల్యే

CTR: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ సినీ నటుడిగా మారారు. ‘ది బ్రెయిన్‌’ సినిమాలో ఆయన హోం మంత్రి పాత్రలో కనిపించనున్నారు. ప్రజా ప్రతినిధిగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, తొలిసారి వెండితెరపై కీలక పాత్ర పోషించడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కొత్త అవతారంపై అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.