హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోకిశీల పీహెచ్‌సీలో సిబ్బంది గైర్హాజరు

PPM: పార్వతీపురం మండలంలోని డోకిశీల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో సోమవారం ఉదయం 10 గంటలు దాటినా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పలువురు సీరియస్‌ రోగులు ఆసుపత్రికి వచ్చినప్పటికీ సిబ్బంది లేకపోవడంపై వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ మాత్రమే ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం.