హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు ప్రతినిధిగా నాగినేని రామకృష్ణ

BPT: అద్దంకి ఏఎంసీ మాజీ అధ్యక్షుడు నాగినేని రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌లో రైతు ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ సహకార శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అద్దంకి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే నాగినేని వెంకయ్య కుమారుడైన రామకృష్ణకు ఈ బాధ్యతలు దక్కడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.