హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొట్ట బ్యారేజ్‌కు పోటెత్తిన వరద నీరు

SKLM: హిరమండలం గొట్ట బ్యారేజ్కు వరద నీరు భారీగా చేరుతోంది. సోమవారం ఉదయం 20 గేట్లు ఓపెన్ చేసి దిగువకు వంశధార నదిలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. వంశధార ఇన్ ఫ్లో 19,500, ఔట్ ఫ్లో 27,487 క్యూసెక్కులుగా నమోదైందని డీఈ సరస్వతి తెలిపారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.