హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్

KRNL: కోసిగి మీదుగా ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి సోమవారం భక్తులు భారీగా తరలివెళ్లడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో రైల్వే గేటు పడటంతో అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ దాదాపు 10 నిమిషాల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ క్రమబద్ధీకరించి అంబులెన్స్‌కు మార్గం సుగమం చేశారు.