హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పూజలు చేస్తుండగా నాగుపాము ప్రత్యక్షం

విజయనగరం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం సంగాం సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం నాగుపాము ప్రత్యక్షమైంది. విగ్రహాలకు ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతి రావు అలంకరణ చేస్తుండగా బుసలు కొడుతూ నాగేంద్రుడు దర్శనమిచ్చాడు. పవిత్ర సోమవారం నాగుపాము కనిపించడంతో శివుని అనుగ్రహంగా భావించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.