హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బంద్, నిరసనలకు అనుమతి లేదు'

BPT: పర్చూరులో ఈరోజు బంద్,ధర్నాలు,ర్యాలీలు,నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని ఎస్సై పులి గోపి తెలిపారు. పాఠశాలలు,కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు,వ్యాపార సంస్థలు యథావిధిగా కొనసాగాలని సూచించారు. బలవంతపు బంద్,రహదారులపై నిరసనలు తెలుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.