హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రేషన్‌ షాపులో టీడీపీ నేత హంగామా!

KRNL: ఆదోని టీడీపీ మండల అధ్యక్షుడు శివప్ప వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల క్రితం రేషన్ షాపు కేటాయింపు విషయంలో రెవెన్యూ ఆర్ఏ లక్ష్మయ్యపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ నేలపై పడుకుని హంగామా చేసినట్లు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శివప్పను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.