హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఈ భార్య మృతిపై పోస్టుమార్టం పూర్తి

E.G: కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఈనెల 16న గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భార్య మీనా (58) మృతదేహానికి రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తైంది. అనంతరం ధవళేశ్వరంలో అంత్యక్రియలు నిర్వహించారు. భార్యాభర్తలు ఎంతో ఆప్యాయంగా ఉండేవారని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.