హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చినచెరువు వద్ద దుర్గంధం.. స్థానికుల ఆవేదన

PPM: జియ్యమ్మవలస మండలం చినమేరంగి బస్టాండ్ సమీపంలోని అల్లువాడ గ్రామానికి వెళ్లే మార్గంలో చినచెరువు పరిసరాలు చెత్తతో నిండిపోయాయి. సమీప దుకాణాల నుంచి కోళ్ల వ్యర్థాలు, పాలిథిన్ సంచులను చెరువు పక్కన పడేయడంతో అపరిశుభ్రంగా మారింది. దీంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమల బెడద పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.