అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలం తుమిడిపుట్ గ్రామంలోని వంతెన లేకపోవడంతో గడ్డ దాటేందుకు ప్రజలు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణానికి త్వరగా నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వంతెన లేక తుమిడిపుట్ గ్రామస్థుల అవస్థలు


