హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆదోనిలో అగ్ని ప్రమాదం

KRNL: ఆదోని శంకరనగర్ సమీపంలోని ఆలూరు రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కల్లుబావికి చెందిన భాషా కుటుంబం నిర్వహిస్తున్న పాల సేమియాల తయారీ బట్టీ మంటల్లో కాలిపోయింది. సర్వీస్ వైరులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.