అన్నమయ్య: సుండుపల్లి మండలం శ్రీనివాసపురం వద్ద ఆదివారం రాత్రి కారు ఢీకొని బాబ్జాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్ర గాయమైందని సమాచారం. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు


