ప్రకాశం: గిద్దలూరులోని బృందావన కాలనీలో ఇంటిముందు నీళ్లు పోయడంపై ఆదివారం రెండు కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. గొంగలరెడ్డి నారాయణరెడ్డి,పక్కింట్లో నివసించే షేక్ ఖాసిం వలీ కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరు కుటుంబాల వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నీళ్ల విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ


