హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి

VSP: ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. సత్యం జంక్షన్ నుంచి అక్కయ్యపాలెం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం గురుద్వార్ జంక్షన్ బస్‌స్టాప్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. యాక్సిడెంట్ చేసి వెళ్లిపోతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని 112కు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని KGHకు తరలించారు.