హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

NLR: మనుబోలు మండలం పరిధిలోని గురువింద పూడి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.